ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గోన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులు వారు అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ పోలీసు అమరులను స్మరించుకునే రోజు. ఈ రోజు విధినిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను స్మరించుకునే రోజు. దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే కమామ్రేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం అక్టోబరు 21 వ తారీఖున పోలీసుల అమరవీరుల సంస్మరణదినోత్సవం దేశమంతా జరుపుకుంటుందని అన్నారు.
1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఆమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో ఇలా దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులు అందరికీ నా శ్రద్ధాంజలి అని అన్నారు.ఈ రోజు కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా థెప్ట్ వరకు, డేటా థెప్ట్ నుంచి సైబర్ హెరాస్మెంట్ వరకు ప్రతి అంశంలోనూ నేరాలన్నీ నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి శిక్షవేయడానికి పోలీసులు ఎంతగానో అప్డేట్ కావాల్సిన యుగంలో మనమంతా ఉన్నాం. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం వల్ల సైబర్ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్నవాళ్లను ఎదుర్కొవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఇవాళ పోలీసుల భుజస్కంధాల మీద మరింతగా వచ్చిపడిందని అన్నారు.
తమ స్వార్ధం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియటే చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పని పెట్టండని అయన అన్నారు. ఆడపిల్లలు, అణగారిన వర్గాల భద్రతలో రాజీ వద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు విషయంలోనూ, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజికవర్గాల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని స్పష్టం చేస్తూ…. సమాజం కోసం విధి నిర్వహణ చేస్తున్న మీ అందిరికీ, మీ కుటుంబాలకు, రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లనీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూనని అన్నారు.