HomeNewsAndhra Pradeshచంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్

Published on

మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏకవాక్యం కోర్ట్ తీర్పునిచ్చింది. అంగళ్ళు కేసులో బెయిల్ పిటిషన్ 23వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ 26కి వాయిదా పడింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో లిస్టింగ్ అయింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్ అక్రమ కేసు, అక్రమ అరెస్టు వ్యవహారాలకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌, అనంతరం ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ చెల్లదని సవాలు చేసిన విషయం విధితమే. దీనిపై ఈనెల 19న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని శుక్రవారానికి రిజర్వు చేసింది. ఇటు ఏపీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. హైకోర్ట్ తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Latest articles

More like this