HomeNewsAndhra Pradeshచంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Published on


రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంకా రిలీఫ్ లభించలేదు. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం వాదనలు ముగిశాయి. భోజన విరామం అనంతరం హైకోర్టులో సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అంతకుముందు చంద్రబాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా న్యాయస్థానానికి తమ వాదనలు వినిపించారు. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.రేపు తీర్సు వెలువడనుంది.

Latest articles

More like this