అంగళ్ళు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్ట్.. పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు చంద్రబాబునాయుడు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రాసిక్యూషన్ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.ఒకవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, మరోవైపు అంగళ్ళు కేసుతో చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందిపెడుతోందని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22న ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం 26వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది. ఈరోజు ఇరువైపులా వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా అనేది సందిగ్ధత నెలకొనడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. చంద్రబాబు విడుదల కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.