బిజినెస్-టు-బిజినెస్ ఇ-కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని ఆఫ్ బిజినెస్ ప్రాంతీయ అధిపతి మోహిత్ చౌధురి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ (జీఎస్ బీహెచ్) విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు తమ అవసరాల సేకరణ కోసం. బీ2బీ మార్కెట్ ప్లేస్లలోకి ప్రవేశిస్తున్న ధోరణిని ఆయన వివరించారు. భారత ఆన్లైన్ బీ2బీ మార్కెట్ ప్లేస్‌లు 2030 నాటికి 200 బిలియన్ల డాలర్ల విలువెన మార్కెట్ అవకాశాన్ని చేరుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉందన్నారు. బీబీ పరిశ్రమలోని ఆశాజనక కెరీర్ అవకాశాల గురించి విలువైన అంతర్గత అంశాలను ఆయన వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి సారించే ప్రముఖ భారతీయ స్టార్టప్ ఆఫ్ బిజినెస్ అని, ముడిపదార్ధాల సేకరణను సులభతరం చేయడానికి, ఎంఎస్ఎంతలకు, ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశిందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విలువను పెంచడానికి నిధులను కేటాయించినట్టు చెప్పారు. గీతమే మేనేజ్ మెంట్ విద్యనభ్యసిస్తున్న ఔత్సాహిక మేనేజర్లు లింక్లోన్లో తమ బయోడేటాను పొందు పరచాలని మోహిత్-సూచించారు. బీబీ పరిశ్రమలో ఒక ప్రొఫెషనల్ నెట్వర్ను సృష్టించడానికి ఇది ఉపకరిస్తుందని, అందులో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు తమ బయోడేటాను earlycareers@of business.in మెయిల్‌కు పంపించాలని చెప్పారు. విద్యార్థులను ప్రశ్నించి, వారి నుంచి జవాబులు రాబడుతూ ఆధ్యంతం ఉత్సాహభరితంగా ఈ ముఖాముఖి నిర్వహించారు. వారు సంధించిన పలు ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో జవాబులు ఇచ్చారు.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer