HomeNewsబీఆర్ఎస్‌కి బిగ్ షాక్… డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి ఏం చర్చించారంటే..?

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్… డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి ఏం చర్చించారంటే..?

Published on

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్ కి షాకివ్వబోతున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరతారా?అవునంటున్నాయి రాజకీయవర్గాలు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని భావిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం భేటీ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. పార్టీలో చేరినప్పుడు కీలక పదవి ఇస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ని కలవాలని భావించినా.. అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్‌లో నిరహార దీక్ష కూడా చేశారు. ఆ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు తమ్ముడు లాంటి వారని చెప్పారు. కొంతకాలంగా కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులును దూరంగా పెడుతూ వస్తోన్నారు. దీంతో మోత్కుపల్లి బీఆర్ఎస్ అధిష్ఠానం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో గవర్నర్ పదవి వస్తుందని ఆశించారు మోత్కుపల్లి. అది కూడా నెరవేరలేదు.

Latest articles

More like this