తెలంగాణలో ఈనెల3వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలపై ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవన్నారు. గతంలో బీజేపీకి 14 వందల పైగా ఓట్లు వస్తే ఇప్పుడు ప్రతీ గ్రామంలో కమలం పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తయారయ్యారని ఈటల అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలని, రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోడీకి సంబంధించిన ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకొని రెండు పార్టీలకు బీజేపీ ముచ్చెమటలు పుట్టిస్తోందన్నారు. ఏ నాడూ ప్రధాని మోదీ అనలేదని ఈటల పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తుందని మాత్రమే అంటారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఏ స్కీములైనా కేసీఆర్ తానిస్తున్నానని అంటున్నారని, తాను లేకుంటే స్కీంలు ఉండవని బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు ఈటల.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer