HomeNewsబీజేపీ రెండవ జాబితాలో బిగ్ ట్విస్ట్

బీజేపీ రెండవ జాబితాలో బిగ్ ట్విస్ట్

Published on

తెలంగాణలో బీజేపీ రెండవ జాబితాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా బీజేపీ హైకమాండ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. కేవలం ఒకే ఒక్క పేరుతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి ని ప్రకటించింది బీజేపీ హై కమాండ్. ఇప్పటికే మొదటి విడత జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడత పేరుతొ ఒక్కరి పేరునే ప్రకటించడం ఇంట్రస్టింగ్ గా మారింది. మొదటి విడతలో కీలక నేతల పేర్లు మిస్ కావడంతో గందరగోళం నెలకొంది. ఈజాబితా విడుదలయిన అనంతరం బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిధున్ కుమార్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు కావడం విశేషం.

Latest articles

More like this