HomeNewsబిగ్ బాస్ 7 విజేతగా కామన్ మేన్.. పల్లవి ప్రశాంత్ ని వరించిన టైటిల్

బిగ్ బాస్ 7 విజేతగా కామన్ మేన్.. పల్లవి ప్రశాంత్ ని వరించిన టైటిల్

Published on

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ 7 ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్‌ని విజయం వరించింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్‌‌దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్‌లో చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు.అమర్ దీప్ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోగా.. ప్రశాంత్‌కి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.మీరు నవ్వినా.. హేళన చేసినా.. నా గురి మాత్రం బిగ్ బాస్.. గుర్తుపెట్టుకోండి.. నా గురి మాత్రం తప్పదు.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే తీరుతా’ అని అన్నాడు. అన్నట్టుగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. చురక పెట్టాలనుకున్న ఒక్కడికి వాత పెట్టేశాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం ద్వారా.ఎంచుకున్న మార్గంలో గమ్యం తప్ప.. కాళ్లకి అంటే బురదను పట్టించుకోలేదు. ‘పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం’ అనే మాటను బిగ్ బాస్ విజేతగా అవతరించి నిజం చేశాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కి రూ.35 లక్షల చెక్‌‌తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.1‍5 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్‌ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్‌ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు. ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్‌బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాడు.

మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్‌‌బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు.ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్‌లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్‌లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్‌లా, ప్రియాంక.. అమర్‌లా యాక్ట్ చేసి చూపించారు.

Latest articles

More like this