HomeNewsపటాన్‌చెరులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి నీలం మధు గుడ్‌బై

పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి నీలం మధు గుడ్‌బై

Published on

పటాన్ చెరు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇటీవల బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పార్టీ నాయకుడు నీలం మధు షాక్ ఇచ్చారు. తనకు తొలుత టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అనూహ్యంగా మళ్ళీ టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి కేటాయించింది. దీంతో నీలం మధు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. తన అనుచరులతో కలిసి ఆయన బీఎస్పీలో చేరారు. గురువారం రాత్రి ప్రకటించిన చివరి జాబితాలో నీలం మధుకు బదులు కాటా శ్రీనివాస్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీ టికెట్‌ను ఖరారు చేసుకున్నారు. ఆ పార్టీ తరఫున నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుంది.

ఇంతకుముందే ఆయన నామినేషన్ వేశారు. బిఫాం కోసం ఎదురుచూశారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు నీలం మధు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అసమ్మతి నేతలకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారని తెలుస్తోంది. టికెట్ రాని 20 మంది నేతలతో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి కూడా టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు హాజరవుతానన్నారు అద్దంకి దయాకర్. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారాన్ని తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది తనపై కుట్రపూరితంగా ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి టికెట్ మందుల శ్యామూల్ కి కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ రాకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయన్నారు. పార్టీ అభ్యర్థి విజయానికి పాటుపడతా అన్నారు.

Latest articles

More like this