HomeNewsజనగాం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు షాక్.. ఎన్నికల్లో ఓటేసేది లేదంటున్న గ్రామస్తులు

జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు షాక్.. ఎన్నికల్లో ఓటేసేది లేదంటున్న గ్రామస్తులు

Published on

జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు షాక్
కొమురవెల్లి మండలం తపస్ పల్లిలో ఘటన
పల్లాని నిలదీసిన తపస్ పల్లి గ్రామస్తులు
తనను ప్రశ్నించిన గ్రామస్తుడిని తోసేసిన పల్లా
పల్లా తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బొందపెడతామంటున్న గ్రామస్తులు

జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజశ్వేర్ రెడ్డికి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో ఆయనను జనం అడ్డుకుంటున్నారు. అయితే, ప్రజలతో మర్యాద లేకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం తపస్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో తపస్ పల్లి గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలదీశారు గ్రామస్థులు. గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందలేదని గ్రామంలో పలు అంశాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోమని తేల్చిచెప్పారు గ్రామస్థులు. అయితే ప్రచారానికి వచ్చిన పల్లా గ్రామస్తుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారని, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో బొందపెడతామంటున్నారు గ్రామస్తులు. తనను నిలదీస్తున్న గ్రామస్తుల పట్ల పల్లా వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. గ్రామస్తుడిని మాట్లాడనీయకుండా పల్లా గెంటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలతో తిరిగితే గ్రామంలో పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ళు రాకుండా చేస్తామని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామంటున్నారు.

Latest articles

More like this