స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ రిలీఫ్ లభించింది. గురువారం ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది.దీంతో లోకేష్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయ్యింది. లోకేష్‌ను స్కిల్ కేసులోనిందితుడిగా తాము చేర్చలేదని సీఐడీ కోర్టుకి తెలిపింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు.హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా కేసులు బనాయించవచ్చు కానీ.. న్యాయస్థానాల్లో న్యాయమే జరుగుతుందన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా శుభవార్త రావాలని.. టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక్క లోకేష్ విషయంలోనే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా త్వరలోనే బిగ్ రిలీఫ్ రావొచ్చని అంటున్నారు.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer