ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు పై,మాజీమంత్రి లోకేష్ పై సిబిఐ విచారణ జరిపించి, జైల్ కు పంపాలని ఏపి మంత్రి ఆర్.కే.రోజా అన్నారు. తిరుమలలో స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనం అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు, లోకేష్, పవన్ లపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ని మేము ఎప్పుడు విమర్శించలేదని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చిన వారు కాబట్టి ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని చెప్పాం అన్నారు.. చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి, గెలిపించండి, ఇండియాలోనే ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చెప్పడాన్ని మాత్రమే మేము ఖండించాం అన్నారు.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమి చేయలేదని, రాష్ట్రం విడిపోయిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందని మాత్రమే చెప్పాంమని, తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జనసైనికులు, టిడిపి వాళ్లు కలిసి ట్రోల్స్ చేశారని, ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ, ఇల్లు గానీ లేకపోయినా హైదరాబాదు నుండి అప్పుడప్పుడు వచ్చి వైసిపి నాయకులపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారని, లోకేష్ ఊరు ఊరికి పోయి మొరుగుతున్నాడని, ప్రతి ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీని తీసుకున్న పవన్ కళ్యాణ్ ఊగిపోతూ, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని నేను ప్రశ్నిస్తున్నానని, చంద్రబాబు ఇంట్లో సోదాలు చేస్తే దాదాపు 118 కోట్ల రూపాయలు నల్లధనం లెక్కలు లేకుండా దొరికిందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పనుల్లో దొంగ బినామీల పేరుతో దోచుకున్నారని, చంద్రబాబు నాయుడుపై లోకేష్ పై సిబిఐ విచారణ వేయించి జైల్లో పెట్టాలన్నారు.. పేద ప్రజలను దోచుకోవడమే కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఐటి అధికారులు సోదాలు చేస్తే ఎందుకు ట్వీట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దాలను నిజాలంటూ స్వీట్ చేసే పవన్ ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాడో అందరికి అర్ధం అయ్యిందన్నారు.. పెళ్ళాలని చూసుకోలేని మోదీ దేశాన్ని ఎలా చూసుకుంటాడోనని అప్పట్లో పవన్ విమర్శలు చేశారని, అమిత్ షా తిరుమల కొండకు వస్తే చంద్రబాబు రాళ్ళు వేయించారని ఆ ఘటనలు వాళ్ళు మరిచి పోలేదని, హైదరాబాదులో ఆరు వందల కోట్ల రూపాయలతో చంద్రబాబు ఇళ్ళు కట్టారని, ఆ ఇంటి వద్దకు ఎవరూ వెళ్ళలేక పోతున్నారని, ఆ ఇంటిపై సోదాలు చేసి నారా చంద్రబాబుపై, నారా లోకేష్ పై సిబిఐ అధికారులు కేసులు పెట్టి జైల్ కి పంపడంతో పాటుగా, పవన్ కళ్యాణ్ ను సైతం సిబిఐ అధికారులు విచారణ చేయాలని ఏపి మంత్రి ఆర్.కే.రోజా డిమాండ్ చేశారు..