చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు రఘువీరా. ఏపీలో ఎదగాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. కాకపోతే వైసీపీ భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని చెప్పారు. భవిష్యత్‌లో జగన్‌కు కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు.బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు మూల కారణం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాలనుకోవడమే అని చెప్పుకొచ్చారు. ఏదో ఒకరోజు జగన్‌కు కూడా ఇదే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో వైసీపీయేతర పక్షాలు మండిపడుతున్నాయి. అటు హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ పై ధర్నాలు, ర్యాలీలు చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 4 వరకూ విచారణ వాయిదా వేశారు.. చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీచేసింది సీఐడీ అధికారులు.