HomeNewsAndhra Pradeshపవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ హాట్ కామెంట్స్.. బర్రెలక్కే బెటర్ అంటూ ఎద్దేవా

పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ హాట్ కామెంట్స్.. బర్రెలక్కే బెటర్ అంటూ ఎద్దేవా

Published on

తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓట్లు రాబట్లలేకపోయింది. తెలంగాణలో 58 వేల ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ మరోసారి విమర్శలు చేశారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్‌.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజె­క్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల పై కామెంట్లు చేశారు. చంద్రబాబు … తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు అంటూ సీఎం ఎద్దేవా చేశారు.విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్‌ లోకల్స్‌ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటారు అంటూ జగన్ ధ్వజమెత్తారు.

Latest articles

More like this