HomeNewsAndhra Pradeshఏపీలో ముందుగానే ఎన్నికలు.. సీఎం జగన్ హాట్ కామెంట్స్

ఏపీలో ముందుగానే ఎన్నికలు.. సీఎం జగన్ హాట్ కామెంట్స్

Published on

ఏపీలో ముందుగానే ఎన్నికలు
ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ కేబినెట్‌ భేటీలో జగన్ కామెంట్లు
ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌
ఎన్నికలకు రెడీగా ఉండాలన్న జగన్

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ముందే జరిగే అవకాశం ఉందని స్వయంగా ఏపీ సీఎం జగన్ ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?. ఇందుకు సంబంధించి ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ‘‘ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చు’’ అని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పారని తెలుస్తోంది. విష ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. జగన్ తాజా కామెంట్ల పట్ల విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Latest articles

More like this