ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థించారు.
అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం అందుకుంటున్నాను.వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు . మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420). నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B). మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468). పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409). నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471). ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.కడప ఎంపీ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ‘కింగ్‌పిన్’ ( మూల విరాట్ ) గా పేర్కొంది.
విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమనించాలి అన్నారు.