HomeNewsAndhra Pradeshచంద్రబాబు కస్టడీపై తీర్పు వాయిదా

చంద్రబాబు కస్టడీపై తీర్పు వాయిదా

Published on

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఇవాళ ఉదయం 11 గంటలకే తీర్పు ఇస్తామన్నారు న్యాయమూర్తి. అనంతరం సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇస్తామన్నారు.కానీ రేపటికి తీర్పు వాయిదా పడింది.

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి..హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి..హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు..హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పారు న్యాయమూర్తి..

రేపటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉదయం నుంచి చంద్రబాబు కేసులో విజయవాడ ACB కోర్టు వెలువరించబోయే కస్టడీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బెంచ్ మీదకు వచ్చిన జడ్జి తీర్పు చెబుతారని భావించారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావించినా అలా జరగలేదు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ పై రేపు నిర్ణయం వెలువడనుంది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ : వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్‌ చేశారు. అంగళ్లు కేసులో బెయిల్‌ పిటిషన్‌ 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ 26వ తేదీకి వాయిదా వేసింది.

Latest articles

More like this