హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్

Prabhas: ప్రభాస్.. దివంగత నటుడు కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకున్న వారసుడు. ఒకప్పుడు తెలుగు తెరపై ఈశ్వర్ సినిమాతో యంగ్ హీరోగా అడుగుపెట్టాడు. ఇప్పుడు డార్లింగ్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడే మన డార్లింగ్, బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్. 2002లో ఈశ్వర్ సినిమాతో మొదలైన తన సినీ ప్రయాణాన్ని ప్రభాస్ కొనసాగించాడు. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఛత్రపతి, మిర్చి సినిమాల్లో మాస్ ఎలివేషన్స్‌తో అప్పటివరకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్‌ను మరో కోణంలో చూశారు అభిమానులు.
బాహుబలితో వరల్డ్ స్టార్‌గా రెబల్ స్టార్(Prabhas)
2015లో బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అమరేంద్ర బాహుబలిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి-2తో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్.. ఇలా పలు జానర్లలో ప్రేక్షకులను అలరిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ లైనప్ చూస్తే మామూలుగా లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా అక్టోబర్ 29, 2027న విడుదల కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ మరో ఆసక్తికరమైన పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇక నాగ్ అశ్విన్‌తో కల్కి 2898 ఏడీ సీక్వెల్, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బర్త్‌డే స్పెషల్ వీడియోలు రిలీజ్
ప్రభాస్ పుట్టినరోజు అంటే అభిమానులకు ప్రత్యేక పండుగే. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. భైరవ బ్యాక్ అంటూ వీడియోను విడుదల చేయగా.. ఫౌజీకి సంబంధించి డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25 పేరుతో పోస్టర్‌ను విడుదల చేశారు. అదేవిధంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ నుంచే కాకుండా జాతీయ స్థాయిలోనూ సినీ, రాజకీయ ప్రముఖులంతా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోలు గోపీచంద్, నారా రోహిత్, ఆది సాయికుమార్, దర్శకులు శ్రీను వైట్ల, హను రాఘవపూడి, మారుతి, వేణు ఉడుగుల, సంపత్ నంది, వైజయంతి మూవీస్, హోంబలే ఫిల్మ్స్ ప్రత్యేక పోస్టులతో శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్..
హిట్లు, ఫ్లాపులు ఏవైనా.. అభిమానుల ప్రేమే తన బలమని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ఈ పుట్టినరోజున మన డార్లింగ్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ.. మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని, మరెన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాం. తెలుగు పాపులర్ టీవీ వెబ్సైట్ తరఫున ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజుకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..



