టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన. 2006-08లో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన. వైవీ సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వలేదు జగన్.. పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల పాటు తితిదే (TTD) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. గతంలోనూ భూమన తితిదే ఛైర్మన్‌గా చేశారు. ఛైర్మన్‌గా నియమించిన సీఎం జగన్ కు ఈ సందర్భంగా భూమన ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్‌రెడ్డి గతంలోనూ తితిదే ఛైర్మన్‌గా పనిచేశారు. వైఎస్ హయాంలో 2006 నుంచి 2008 వరకు తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఉప ఎన్నికలో, 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.వైసీపీలో కీలక నేతగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఆ పదవి వరిస్తుందా లేదా అనేదానికి ఫుల్ స్టాప్ పడింది. వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో పలువురు వైసీపీ నాయకులు సీఎం జగన్‌ను కలిసి టీటీడీ చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే జగన్ మాత్రం భూమనకే అవకాశం ఇచ్చారు.