గణేష్ నవరాత్రుల చివరిలో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు. రికార్డు ధర పలికింది బండ్లగూడ జాగీర్ గణేషుడి లడ్డూ… కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో జరిగిన వేలంలో కోటి 26 లక్షలు పలికిన లడ్డూ..లడ్డూ వేలంలో పాల్గొని లడ్డూని దక్కించుకున్న మహిళలు . మరోవైపు గురువారంనాడు వైభవంగా ప్రారంభమయింది గణేష్ శోభాయాత్ర.. వినాయక్ సాగర్ కు తరలుతున్నారు గణనాథులు.. భారీ బందోబస్తు.. 27లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూని స్వంతం చేసుకున్న తుర్కయాంజల్ మునిసిపాలిటీ పాటిగూడకి చెందిన దాసరి దయానంద్ రెడ్డి . గతేడాది రికార్డు స్థాయిలో రూ.24,60,000లు బాలాపూర్ లడ్డూను స్థానికులే దక్కించుకోగా.. ఈ సారి లడ్డూ ధర కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ ఏడాది రియల్ వ్యాపారి దాసరి దయానంద రెడ్డి రూ 27 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన దయానందరెడ్డి ఈ ఏడాది దక్కించుకోవాలని చివరి వరకు వేలంలో నిలిచారు. ధర ఎంతైనా కొనాలని ఆయన నిర్ణయం తీసుకుని చివరికి తన పంతం నెగ్గించుకున్నారు.ఎట్టకేలకు రూ 27 లక్షలకు దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. 1994లో రూ. 450లతో మొదలయ్యింది ఈ లడ్డూ వేలం పాట. కరోనా సమయంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతుంటుంది. 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. 2015లో బాలాపూర్ లడ్డూ రూ. 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10.32 లక్షలకు ఆ లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది వేలం పాటలో 36 మంది పోటీ పడ్డారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఆ లడ్డూను సీఎంకు అందించారు.ఈ సారి లడ్డూ వచ్చిన వారి, తీసుకున్న వారి పేర్లను వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.