Congress Donations Decline

75 శాతం పతనం!
కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితిపై దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చంది. తాజా విరాళాల గణాంకాలు ఆపార్టీకి భారీగా షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయి విరాళాలు అందుకున్న ఆజాతీయ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా కుదేలైంది. ఇప్పుడు భారీగా నిధులు తగ్గిపోతున్నాయి. ఏడాదిలోనే 75 శాతం నిధులు పతనం అయినట్లు ఆపార్టీ చెప్పిన గణాంకాలే నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 517 కోట్ల 39 లక్షల రూపాయల విరాళాలు అందుకోగా.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తం కేవలం 130 కోట్ల 69 లక్షల రూపాయలకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 75 శాతం విరాళాలు తగ్గిపోయాయన్నమాట. గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌కు నమోదైన అతిపెద్ద వార్షిక విరాళాల పతనం(Congress Donations Decline) ఇదే. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలే ఎన్నికల రాజకీయాల్లో అధికార పార్టీతో పోటీపడేందుకు ఆర్థిక వనరులు కీలకంగా మారుతున్న వేళ.. కాంగ్రెస్‌కు విరాళాల రూపంలో అందుతున్న సాయం ఇంత భారీగా తగ్గడం పార్టీ ఆర్థిక వ్యూహంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

దశాబ్ధ కాలంగా ప్రభావం ..!
కాంగ్రెస్ విరాళాల తగ్గుదల ఈ ఒక్క ఏడాదికే పరిమితమైన అంశం కాదు. గత 10 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 12 ఆర్థిక సంవత్సరాల్లో 2015-16లో మాత్రమే ఇంతకంటే భారీ స్థాయిలో విరాళాల పతనం నమోదైంది. ఆ ఏడాది కాంగ్రెస్‌కు అందిన విరాళాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 141 కోట్ల 46 లక్షల రూపాయల నుంచి ఏకంగా 86 శాతం మేర పడిపోయాయి. ఇప్పుడు మరోసారి 75 శాతం పడిపోవడం పార్టీకి ఆర్థికంగా ఎదురవుతున్న సవాళ్లుగా స్పష్టం చేస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29(సి) ప్రకారం.. రాజకీయ పార్టీలు 20 వేల రూపాయలకు మించిన విరాళాల(Congress Donations Decline) వివరాలను ప్రతి ఏడాది ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఈ నిబంధనలో భాగంగా కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకన్ విరాళాల నివేదికను ఎన్నికల సంఘానికి అందించారు. ఆ నివేదికలోని వివరాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆట్రస్ట్ నుంచే భారీ కోత..!
కాంగ్రెస్‌కు విరాళాలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధాన కారణం ఒకే ఒక్క సంస్థ. అదే ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ట్రస్ట్ ద్వారా కాంగ్రెస్‌కు 216 కోట్ల 34 లక్షల రూపాయలు అందాయి. కానీ 2025-26లో ఆ మొత్తం కేవలం 25 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంటే దాదాపు 88 శాతం మేర ఈ ఒక్క మార్గం ద్వారా వచ్చే విరాళాలు తగ్గిపోయాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పనిచేసే ఎలక్టోరల్ ట్రస్ట్. వివిధ కంపెనీలు, సంస్థలు, వ్యక్తుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి.. చట్టబద్ధమైన విధానంలో రాజకీయ పార్టీలకు నిధులు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. దాతలు నేరుగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా.. ఈ ట్రస్ట్ ద్వారా తమ విరాళాలను అందిస్తారు. అయితే ఏ పార్టీకి ఎంత మొత్తం అందించాలన్నది దాతల విరాళాలు, ట్రస్ట్ కేటాయింపులు, సంబంధిత నిబంధనల ఆధారంగా ఉంటుంది. కాంగ్రెస్‌కు ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులు భారీగా తగ్గడంతో.. ఫండ్ రైజింగ్ పై ప్రభావం చూపింది. మరోవైపు బీజేపీ ఫండింగ్ లెక్కలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీజేపీ విరాళాల నివేదిక ఎన్నికల సంఘం ఇంకా బయటపెట్టలేదు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఏకంగా 6 వేల 74 కోట్ల 2 లక్షల రూపాయల విరాళాలు అందాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు వచ్చింది కేవలం 517 కోట్ల 39 లక్షల రూపాయలే. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ విరాళాలు(Congress Donations Decline) దాదాపు 12 రెట్లు తక్కువ. భారీ విరాళాల విషయంలో నమోదైన ఈ పతనం కాంగ్రెస్‌కు రాజకీయంగా, సంస్థాగతంగా ఒక కీలక సవాలుగా మారనుంది.