HomeBusinessఅక్కడ కిలో 40రూ.లకే టమోటా.. ఎక్కడంటే?

అక్కడ కిలో 40రూ.లకే టమోటా.. ఎక్కడంటే?

Published on

టమోటా పంట దిగుబడి తక్కువగా ఉండడంతో జనం కొనలేక అవస్థలుపడ్డారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం నుంచి కిలో టమాటా 40 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆగస్ట్ 15 నుంచి కిలో టమోటా 50 రూపాయలకు, అంతకంటే తక్కువ ధరకే అందుబాటులో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇవ్వక ముందే టమోటా ధరలు దిగొచ్చాయి. ఏపీలోని మదనపల్లె, అనంతపురంతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండుతున్న టమాటా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు రెండు నెలలుగా ఊహించని ధరతో ఠారెత్తించిన టమాటా ధరలు తగ్గుతుండటంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కేజీ టమాటాను 40 రూపాయలకు విక్రయించాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Latest articles

More like this