వర్థమాన సినీనటి మీనాక్షి చౌదరి హైదరాబాద్ కి చెందిన మోడల్. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. మాదాపూర్ హైటెక్ సమీపంలో బి న్యూ మొబైల్స్ లో ఆమె రెడ్ మీ 12 5జీ మొబైల్ మోడల్ ని ప్రారంభించారు.
ఆధునిక మార్కెట్లో రెడ్మీ మొబైల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో రెడ్మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది.భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర అనేక ఫీచర్లు కలిగిన మొబైల్స్ లభిస్తున్నాయి. బిన్యూ మొబైల్స్ లో అన్ని అత్యాధునిక మొబైల్స్ తక్కువ ధరలకు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.