పదేపదే బీసీ రాగం.. ఎప్పుడు మోక్షం
BC Slogan Telangana Congress: బీసీ వ్యక్తి సీఎం అనేక్రమంలో అలా అని సీఎం రేవంత్‌ను తక్కువ చేసి మాట్లాడం లేదు మహేష్ గౌడ్. రేవంత్‌రెడ్డి పాలనపై మహేష్ గౌడ్ ప్రశంసలు కురిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లగా అదర్భుంగా అమలుచేస్తున్నారని ఆశాకానికెత్తుతున్నారు. రేవంత్‌రెడ్డి పనితీరుతోనే 2034లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మళ్లీ రేవంత్‌రెడ్డే సీఎం అవుతారని చెప్తున్నారు

BC Slogan Telangana Congress: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు మహేష్ గౌడ్ ఇటీవల ఒకే పాట పాడుతున్నారు. వేదిక ఏదైనా ఒకే పాట.. ఒకటే రాగం ఎత్తుకుంటున్నారు. అదే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి. బీసీ సీఎం మా నినాదం కాదని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన అని మరోసారి చెప్పకనే చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి గడువులు లేవన్నారు. భవిష్యత్తులో ఏదోఒకరోజు తెలంగాణకు కాంగ్రెస్ ద్వారానే బీసీ ముఖ్యమంత్రి అవుతారని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్లో బీసీ వ్యక్తిని సీఎం అయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఆపార్టీ అలాంటి సాహసం చేస్తుందా? అని క్వశ్చన్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు.
బీసీ వ్యక్తి సీఎం అనేక్రమంలో అలా అని సీఎం రేవంత్‌ను తక్కువ చేసి మాట్లాడం లేదు మహేష్ గౌడ్. రేవంత్‌రెడ్డి పాలనపై మహేష్ గౌడ్ ప్రశంసలు కురిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లగా అదర్భుంగా అమలుచేస్తున్నారని ఆశాకానికెత్తుతున్నారు. రేవంత్‌రెడ్డి పనితీరుతోనే 2034లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మళ్లీ రేవంత్‌రెడ్డే సీఎం అవుతారని చెప్తున్నారు. అంతేకాదు 2039లోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమాగా మాట్లాడుతున్నారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకే రేవంత్‌రెడ్డి 2034 వరకు తానే సీఎంగా ఉంటారని చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ మాటల్లో ఎలాంటి తప్పేమీ లేదన్నారు. వచ్చే టర్మ్‌లో రేవంత్‌రెడ్డే సీఎం అయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం బీసీ నేతకే సీఎం పదవి అవకాశం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్పోరేషన్ పదువులతో పాటు స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేశామన్నారు. కులగణన ఆధారంగా పదవులు పంచామన్నారు. కొండా సురేష విషయంలో ఆమె కుమార్తె తొందరపడి వ్యవహరించారని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బీసీ సీఎం అని మహేష్ గౌడ్ ప్రతీ సందర్భంలోను చెప్పడం వెనుక రాజకీయ చర్చ జరుగుతోంది. వేదిక ఏదైనా బీసీ సీఎం అనే మాటను పదే పదే చెప్పడంలో ఆంతర్యం ఏంటా అని చర్చించుకుంటున్నారు. అసలు అలాంటి పరిస్థితి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


