మోగిన లోకల్ ఎన్నికల నగారా.. నేటి నుంచే కోడ్ అమలు
నవంబర్ 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2 మూడో విడత పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఎప్పటిలాగే ఎన్నికలు జరిగిన రోజే పంచాయతీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పింది ఎన్నికల సంఘం

AP municipal elections 2026
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుల చేశారు. ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయితీలకు(AP municipal elections 2026) ఈనెల 28న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈనెల 30న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ దాఖలుకు ఈనెల 18వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్ పరిశీలించనున్నారు. విత్ డ్రా చేసుకునేందుకు ఈనెల 21వరకు గడవు విధించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మున్సిపాలిటీ(AP municipal elections 2026) ఎన్నికల మాదిరిగానే ఒకే విడతలో పోలింగ్ జరపున్నారు. నవంబరు 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 19న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. నామినేషన్ల దాఖలుకు ఈనెల 23 కాగా.. విత్ డ్రా చేసుకునేందుకు 27వరకు గడువు ఉంది. ఎన్నికలు జరిగిన రెండు రోజుల వ్యవధిలో నవంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. పంచాయితీల విషయంలో ఎన్నికల సంఘం మొదటి నుంచి చెప్తున్నట్లుగానే నిర్ణయం తీసుకుంది. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. నవంబర్ 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2 మూడో విడత పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఎప్పటిలాగే ఎన్నికలు జరిగిన రోజే పంచాయతీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పింది ఎన్నికల సంఘం. నగదు విషయంలో ఆంక్షలు పెట్టింది. నగదుకు సంబంధించి వివరాలు అధికారులు చెక్ చేసేటప్పుడు చూపించాలని తెలిపింది.


