రేపే నోటిఫికేషన్.. స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ
పోటీ చేసే అభ్యర్థులకు అన్నివిధాల భద్రత కల్పించాలని రాజకీయ పక్షాలు కోరాయని అనిల్ పునేఠా చెప్పారు. విజయవాడలో జరిగిన ఎస్ ఈసీ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ సహా మిగతా పార్టీలన్నీ హాజరయ్యాయి.

AP Local Body Elections 2026
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిత్ చంద్ర పునేఠా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాల తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్(AP Local Body Elections 2026) రాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన వెనువెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.
ఇవాళ విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో రాజకీయ పక్షాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. ఈభేటీలో అన్ని పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషనర్ తెలుసుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు అన్నివిధాల భద్రత కల్పించాలని రాజకీయ పక్షాలు కోరాయని అనిల్ పునేఠా చెప్పారు. విజయవాడలో జరిగిన ఎస్ ఈసీ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ సహా మిగతా పార్టీలన్నీ హాజరయ్యాయి. వైసీపీ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, జనసేన నుంచి శివశంకర్, టీడీపీ నుంచి అశోక్‌బాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఎస్ఈసీతో సమావేశం తర్వాత ఎన్నికల సంఘం తీరును వైసీపీ నేతలు తప్పుబట్టారు. రేపు ఎన్నికల షెడ్యూల్ (AP Local Body Elections 2026)విడుదలవుతుండగా.. ఇవాళ సమావేశం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. అంతేకాదు.. అభ్యంతరాలుంటే చెప్పమని అడగడం చూస్తే స్థానిక ఎన్నికలు ఎంత పారదర్శకంగా నిర్వహించబోతున్నారో అర్థమవుతోందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు.


