Anupama Parameswaran:ప్రేమం, శతమానం భవతి, ఆ..ఆ, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్‌, 18 పేజెస్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అనుపమ పరవేశ్వరన్‌ తాజాగా క్రేజీ కల్యాణం సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ఇప్పటికే శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జోడీ కట్టిన అనుపమ.. ఇప్పుడు భోగి సినిమాతో మరోసారి జతకట్టారు. తాజాగా తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు.

నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే..!
అనుపమ తన జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పేంటో చెప్పారు. చాలా ఏళ్ల పాటు తన కోసం తాను బతకడం అనేదాన్ని మర్చిపోయానన్నారు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లగా ఫ్యామిలీ ఆశించే బాధ్యతలు నెరవేర్చడమే నా కార్తవ్యంగా బతికానన్నారు. సినిమాల వైపు వచ్చాక ఇక్కడ ఎదురయ్యే పరిస్థితుల వల్ల పేరెంట్స్‌కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని టెన్షన్‌కి గురయ్యే దాన్ని అని చెప్పారు. ఎప్పుడూ ఇతరులు గురించి ఆలోచించి.. తన మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని తెలిపారు. ఇతరులకు నో చెప్పలేక చాలా కోల్పోయానన్నారు. ఈ విషయాన్ని చాలా లేట్‌గా తెలుసుకున్నానని తెలిపారు. కాని జీవితం అంటే ఇది కాదని.. మన కోసం మనం బ్రతకడమేనని తెలిసిందన్నారు. ఇతరుల కోసం బతకడంలో అర్ధమే లేదన్నారు. మనల్ని మనం ప్రేమించుకోకపోతే మనల్ని ఎవరూ ఇష్టపడరన్నారు అనుపమ (Anupama Parameswaran).

తమ్ముడితో మాట్లాడం లేదు
తన ఫ్యామిలీ విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు అనుపమ. తన తమ్ముడితో ఎప్పుడూ గొడవపడలేదని.. కాని ఈమధ్య ఓ ఘటన జరిగినప్పుడు ఇద్దరం ఇగోలకు పోయి మాట్లాడుకోవలేదన్నారు. అప్పుడు తమ్ముడు సారీ చెబితే మాట్లాడుదామని అనుకున్నా.. వాడు చెప్పలేదు. తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్ పెడితే నేను లైక్ కొట్టలేదన్నారు. తర్వాత పోస్ట్‌కు లైక్ కొట్టి .. ఐ డోంట్ లైక్ యూ అని కామెంట్ పెడితే అప్పుడు ఎలా ఉన్నావని రిప్లై ఇచ్చాడని .. దాంతో తిరిగి మాట్లాడుకున్నామని తన తమ్ముడిపై ఉన్న ప్రేమను వెలికిబుచ్చారు అనుపమ.

రింగుల జుట్టుపై కామెంట్స్..
తన స్కూల్ డేస్ నుంచే రింగుల జుట్టుపై కామెంట్స్ చేసేవారని .. కొందరైతే సరదాగా పెన్నులు, ఆకులు, చిత్తు కాగితాలు జుట్టులో దాచిపెట్టి గేలి చేసేవారని చెప్పారు అనుపమ(Anupama Parameswaran). చిన్నప్పటినుంచి కూడా తనకు జుట్టు అలాగే ఉండేదని.. ఆడిషన్స్ కు వెళ్లేటప్పుడు కర్లీ హెయిర్ వల్ల ఛాన్స్ మిస్ అవుతానేమోనన్న భయం ఉండేదన్నారు. ప్రేమం సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు భయపడి నూనే రాసి జుట్టు నున్నగా దువ్వుకుని వెళ్లానని తెలిపారు. కాని ఆడిషన్స్ లో డైరెక్టర్ హెయిర్ లూజ్ చేయమని .. కర్లీ హెయిర్ చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. ఆతర్వాత నా హెయిర్ స్టైల్ కి ప్రశంసలు రావడంతో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు.

సెలక్ట్ అయ్యానని ఫ్రెండ్స్‌తో చెప్పలేదు
తాను ప్రేమం సినిమాకు సెలక్ట్ అయినట్లు తన ఫ్రెండ్స్ కూడా చెప్పలేదని.. చివరకు పాటలు రిలీజ్ అయ్యాక తెలుసుకుని ఆశ్చర్యపోయారని తెలిపారు. ప్రేమం షూటింగ్ కోసం జ్వరమని చెప్పి 20రోజులు కాలేజీకి లీవ్ పెట్టానని వెల్లడించారు. ప్రేమం రిలీజైన తర్వాత త్రివిక్రమ్‌ అ..ఆ సినిమా కోసం పిలిచారన్నారు. అప్పుడే హైదరాబాద్‌కు ఫస్ట్‌టైం వచ్చానని చెప్పారు. కాలేజీలో లెక్చరర్స్ లవ్ గురించి గొప్పగా చెప్పేవారని ..లవ్ చేసుకోమని స్టూడెండ్స్‌ని ఎంకరేజ్‌ చేసేవారని చెప్పారు అనుపమ. కాని తనకు సినిమా బిజీ వల్ల ప్రేమ అనుభూతి పొందలేకపోయానని చెప్పారు. సినిమాల వల్లే కాలేజ్‌ లైఫ్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు అనుపమ.