తెలంగాణలో కేసీఆర్ ని నమ్మి మోసపోయామని భావిస్తున్న సీపీఐ ఇక రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలనేదానిపై ఒక నిర్ణయానికి రాలేదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని సీపీఐ నేతలు చెబుతున్నారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహగానాల నేపథ్యంలో పొత్తుల విషయంలో తొందరపడకూడదని సీపీఐ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి ఇటీవల జరిగిన అనధికారిక చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన లోక్‌సభ సీట్లను కూడా కాంగ్రె్‌సను అడగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను 11 నుంచి 17వ తేదీ దాకా నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. వారోత్సవాల చివరి రోజైన 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరుకానున్నారు.ఈ సభలో పొత్తులపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer