HomeNewsAndhra Pradeshభాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు షాక్

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు షాక్

Published on

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది హైకోర్ట్. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్ళిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. వైఎస్ వివేకా కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్ట్. గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. సీబీఐ, సునీత వాదనల్లో మెరిట్స్ ఉండడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Latest articles

More like this