HomeNewsNationalఅత్యంత కాలుష్య నగరం

అత్యంత కాలుష్య నగరం

Published on

ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. అక్కడ బతకడం చాలా కష్టంగా మారింది. తాజాగా ఢిల్లీ విషయంలో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత కాలుష్య స్థాయిలు ఇదే విధంగా కొనసాగితే ఇక్కడి ప్రజల ఆయుర్దాయంలో 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా, పెరిగిపోతున్న జనాభా, పరిశ్రమల కాలుష్యం కారణంగా జనజీవనం దుర్భరంగా మారుతోంది.

Latest articles

More like this