HomeNewsAndhra Pradeshఆ రూట్లో రైళ్ళు రద్దు.. కారణం ఏంటంటే?

ఆ రూట్లో రైళ్ళు రద్దు.. కారణం ఏంటంటే?

Published on

దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పలు రైళ్ళను రద్దు చేశారు అధికారులు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని అనకాపల్లి–తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల కారణంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.రద్దయిన రైళ్ళ విషయానికి వస్తే.. మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు, విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు, విజయవాడ–విశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్‌ 2, 4 తేదీల్లో, రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467), గుంటూరు–విశాఖపట్నం (17239), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్‌ 4న, విశాఖపట్నం–గుంటూరు (17240) రైలు సెప్టెంబర్‌ 5న రద్దు చేశారు.తిరుపతి–విశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్‌ 1, 3 తేదీల్లో, విశాఖపట్నం–తిరుపతి (22707) సామర్లకోట–విశాఖపట్నం మధ్య సెప్టెంబర్‌ 3, 5 తేదీల్లో, విజయవాడ–విశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–­అ­నకాపల్లి మధ్య ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. ఈవిషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

Latest articles

More like this