HomeNewsఎమ్మెల్యే టికెట్లు,వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ధ.. విద్యారంగంపై ఏదీ?

ఎమ్మెల్యే టికెట్లు,వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ధ.. విద్యారంగంపై ఏదీ?

Published on

రాష్ట్రంలో ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల మీద, వైన్స్ షాపుల టెండర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల మీద లేదని ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చార్మినార్ శాఖ ఆధ్వర్యంలో సిటీ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోఠి జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని తెలంగాణలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణలో నీళ్లు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫాంహౌస్ కు,నిధులు కేసీఆర్ ఇంట్లోకి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే దక్కాయని మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ.5300 కోట్ల స్కాలర్ షిప్,ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న 1,91000 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గతంలో 10.50 శాతం ఉన్న రాష్ట్ర విద్యా బడ్జెట్ ఇప్పుడు 5.67 శాతానికి దిగజార్చారు అని అన్నారు.ఇప్పటికైనా ఎలక్షన్ కు ముందు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Latest articles

More like this