HomeNewsకాంగ్రెస్ టికెట్ ప్లీజ్.. రేఖానాయక్ అప్లికేషన్

కాంగ్రెస్ టికెట్ ప్లీజ్.. రేఖానాయక్ అప్లికేషన్

Published on

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లు రానినేతలు మరో ప్రత్యామ్నాయం వెదుకుతున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌కు ఎమ్మెల్యే రేఖా నాయక్‌ దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్ కు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖానాయక్‌ పీఏ దరఖాస్తు అందజేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే రేఖానాయక్‌ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని గతంలోనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకోవడంతో అది కన్ఫమ్ అయింది.

ఖానాపూర్‌ టికెట్‌ను భూక్యా జాన్సన్‌కు కేసీఆర్ కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే రేఖా నాయక్‌ కూడా హస్తం పార్టీలో చేరనున్నారు. అందులో భాగంగానే రేఖా నాయక్ ఖానాపూర్ టికెట్ ఆశిస్తూ దరఖాస్తులు సమర్చించారు. నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని..తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎవరు మోసం చేసినా భగవంతుడు మోసం చేయడనే నమ్మకం తనకుందని చెప్పారు. ఖానాపూర్‌ నుంచి తాను పోటీలో ఉండటం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఖానాపూర్ లో పోటీ తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ విషయంలో అందరిపై కరుణ చూపిన కేసీఆర్ రేఖానాయక్ విషయంలో ఎందుకిలా వ్యవహరించారో అర్థం కావడం లేదంటున్నారు ఖానాపూర్ వాసులు.

Latest articles

More like this