HomeNewsAndhra Pradeshలోకల్ బై పోల్స్ లో వైసీపీ ప్రభంజనం… 2024 ఫలితాలకిదే సాక్ష్యం

లోకల్ బై పోల్స్ లో వైసీపీ ప్రభంజనం… 2024 ఫలితాలకిదే సాక్ష్యం

Published on

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైనాట్ 175 అంటూ జగన్ ప్రచారం మొదలెట్టారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అందిస్తున్న పథకాలే తమ సక్సెస్ కు నాంది అవుతాయంటున్నారు సీఎం జగన్. 2024 ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే జరిగిన పంచాయితీ ఉప ఎన్నికలు అధికార పార్టీ వైసీపీ హవాని మరోమారు వెల్లడించాయి. అధికార వైసీపీ ఫలితాల లెక్కలను జనం ముందు ఉంచింది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఈ ఫలితాలు సంకేతం అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో 30 సర్పంచ్ పదవులు వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. అంటే సగానికి సగం వైసీపీ పరం అయ్యాయన్నమాట. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైసీపీ మద్దతు దారులు విజయం సాధించారు.10 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైసీపీ, 90 టీడీపీ, 4 నసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో అయిదుగురు వైసీపీ మద్దతుదారులు విజయ దుందుభి మొగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ మద్దతుదారు గెలుపొందడం అంటే వైసీపీ ప్రభంజనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించడం టీడీపీ ఎలాంటి పతన స్థితిలోకి చేరిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు వైసీపీ నేతలు. అయితే, ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని టీడీపీ ప్రచారం చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నిక ఏదైనా ఫ్యాన్ గాలిదే ప్రభంజనం. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో 85 శాతానికి పైగా వైసీపీ విజయం సాధించింది. ఎన్నిక ఏదైనా వైసీపీదే ప్రభంజనం అని వెల్లడైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఏవైనా వార్ వన్ సైడే..2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు ఇదే సంకేతం అంటున్నారు.

మరోవైపు వైసీపీ ఎన్నికలకు సంబంధించి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు గెలుపు గుర్రాలను ఎంపిక చేసిన వైసీపీ అధిష్టానం ప్రకటించేందుకు రెడీ అవుతుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ రెడీ అవుతోందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రాబోయేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని సర్వేలు చెబుతున్నవేళ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పోటీ తీవ్రంగా ఉండడంతో అభ్యర్ధులు తమకు టికెట్ ఇవ్వాలని, గెలిచి చూపిస్తామని అధిష్టానాన్ని కోరుతున్నారు.

2024 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది.ఐదు నెలలకు ముందే అభ్యర్థుల జాబితాని విడుదల చేయడం ద్వారా రేసులో ముందుడండాలని భావిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక అన్ని నియోజకవర్గాలపైనా వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైసీపీ భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తున్నారు.ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి కూడా మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే తొలి జాబితాను దసరా నాటికి విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. గెలుపు గ్యారంటీ అనే నియోజకవర్గాల అభ్యర్థులను తొలివిడత జాబితాలో ప్రకటించనున్నారు. హోరాహోరీ పోటీ తప్పదన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అవుతుందని భావించిన వారి జాబితా మూడో దశలో విడుదల చేస్తారని అంటున్నారు.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు చేస్తూ వస్తున్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్, చీరాల నుంచి కరణం వెంకటేశ్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మద్దాల గిరి, కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ పేర్లను దాదాపు ఖరారు చేసింది. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన వివిధ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. సర్వేలతోపాటు సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక నిర్వహిస్తోంది అధిష్టానం. తొలి జాబితాలో కీలకమయిన స్థానాలకు సంబంధించి సుమారు 30 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. ఇందులో కొత్తవారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో వైఎస్ జగన్ మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలిచేందుకు జగన్ వ్యూహరచన చేశారు.

Latest articles

More like this