HomeNewsBRS తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు వీరేనా..!?

BRS తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు వీరేనా..!?

Published on

బీఆర్ఎస్ తొలి జాబితా ఇదేనా…. 21న విడుదల

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఆగస్టు 21 నాటికి బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేసీఆర్ కి సెంటిమెంట్ అంటే ఇష్టం. శ్రావణ మాసంలో 80 నుంచి 90 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అన్నీఅనుకున్నట్లు జరిగితే ఆగస్టు-21న అనగా సోమవారం నాడు అధికారికంగా ప్రగతిభవన్ వేదికగా స్వయానా సీఎం కేసీఆరే అభ్యర్థులను పిలిచి వారి సమక్షంలోనే రిలీజ్ చేస్తారని చెబుతున్నారు.

బీఆర్ఎస్ తొలి జాబితాను రిలీజ్ చేయకముందే.. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ముఖ్యులే దీన్ని వైరల్ చేస్తుండటంతో ఇది నిజంగానే లీకైన అభ్యర్థుల జాబితా అని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇంకొందరేమో ఈ జాబితాను కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో కొందరు సిట్టింగ్‌లు పేర్లు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తుల పేర్లు, కొన్నిరోజులుగా పార్టీ మారుతున్నారనే సిట్టింగుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం. అందులోనూ కొత్త వ్యక్తుల పేర్లు ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌లు కొందరు వివాదాల్లో ఉన్నవారే ఉన్నారు. హైకమాండ్ పనిగట్టుకుని మరీ ఇలా రిలీజ్ చేసింది.. జనాల నుంచి, ఆయా సిట్టింగ్‌ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని తెలుసుకునేందుకే ఇలా లీక్ చేయించిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ లిస్ట్ బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.

హైదరాబాద్ జిల్లాకు సంబంధించి…

ముషీరాబాద్‌ : ముఠాగోపాల్

ఖైరతాబాద్‌ : దానం నాగేందర్

జూబ్లీహిల్స్‌ : మాగంటి గోపీనాథ్

సనత్ నగర్‌: తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్‌ : పద్మారావు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి

మేడ్చల్‌ : చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి : మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ : కేపీ వివేకానంద

కూకట్‌పల్లి : మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్‌ : దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి

శేర్లింగంపల్లి : అరికెపూడి గాంధీ

వికారాబాద్‌ : మెతుకు ఆనంద్

తాండూరు : పైలెట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి

సూర్యాపేట : జగదీష్ రెడ్డి

నల్గొండ : కంచర్ల భూపాల్ రెడ్డి

హుజూర్‌నగర్‌ : శానంపూడి సైదిరెడ్డి

భువనగిరి : పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్‌ : చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి : గాదరి కిషోర్

ఆలేరు : గొంగిడి సునీత

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి

కరీంనగర్‌ : గంగుల కమలాకర్

సిరిసిల్ల : కేటీఆర్

మనకొండురు : రసమయి బాలకిషన్

రామగుండం : కోరుగంటి చందర్

కోరుట్ల : విద్యాసాగర్ రావు

హుస్నాబాద్‌ : ఒడితల సతీష్

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి

కొడంగల్‌ : పట్నం నరేందర్ రెడ్డి

జడ్చర్ల : లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌ : శ్రీనివాస్ గౌడ్‌

దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్‌ : చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి : నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్‌ : మర్రి జనార్దన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి

పినపాక : రేగా కాంతారావు

ఇల్లందు : బానోతు హరిప్రియ నాయక్

ఖమ్మం : పువ్వాడ అజయ్

పాలేరు : కందాల ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి : సండ్ర వెంకట వీరయ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి

పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల : చల్ల ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ : దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు : వద్దిరాజు రవిచంద్ర

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : కడియం శ్రీహరి

జనగాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

వర్ధన్నపేట : ఆరూరి రమేష్

భూపాలపల్లి : గండ్ర వెంకట రమణారెడ్డి

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి

సిద్దిపేట : హరీష్ రావు

దుబ్బాక : కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్‌: కేసీఆర్

పఠాన్ చెరు : గూడెం మహిపాల్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి

చెన్నూరు : బాల్క సుమన్

అదిలాబాద్‌ : జోగు రామన్న

బోథ్‌ : రాథోడ్ బాపురావు

ఆసిఫాబాద్‌ : ఆత్రం సక్కు

నిర్మల్‌ : ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి

ఆర్మూర్‌ : జీవన్ రెడ్డి

బోధన్‌ : షకీల్

బాన్సువాడ : పోచారం శ్రీనివాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌ : గణేష్ బిగాలా

నిజామాబాద్ రూరల్‌ : బాజిరెడ్డి గోవర్దన్

బాల్కొండ : వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

కొందరు ఎమ్మెల్సీలను శాసనసభకు పంపుతారని అంటున్నారు. జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని గత 48 గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పైగా ఈ జాబితాలో కూడా పల్లా పేరే ఉంది. ముత్తిరెడ్డిపైన ఎన్నెన్ని భూ ఆరోపణలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి ఆయన సొంత కూతురే తిరుగుబాటు చేసిన పరిస్థితి.ప్రస్తుతం పల్లా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కేసీఆర్‌కు అత్యంత ఆప్తుల్లో పల్లా కూడా ఒకరన్న విషయం తెలిసిందే. అందుకే వివాదాల రెడ్డిగా పేరుగాంచిన.. పార్టీకి పదే పదే చెడ్డపేరు తెస్తున్న ముత్తిరెడ్డిని పక్కనెట్టేశారనే టాక్ బీఆర్ఎస్ నుంచే వినిపిస్తోంది. ఇక స్టేషన్ ఘనపూర్ విషయానికొస్తే..ఈ నియోకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ రాజయ్య ఒకటా రెండా లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో రాజయ్యకు కావాల్సినంత చెడ్డపేరు వచ్చిపడింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరికి అప్పగించారు. మరోవైపు.. జాబితాను ఇంకాస్త పరిశీలిస్తే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చేసినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక..సీఎం కేసీఆర్ నియోజకవర్గం మారుతారు అని చాలా రోజులు పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ అదంతా నిజం కాదంటున్నారు. క కేసీఆర్ రిలీజ్ చేస్తారన్న అసలు సిసలైన జాబితా వస్తేగానీ పూర్తి క్లారిటీ రాదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Latest articles

More like this