రైళ్ళలో ప్రయాణం చాలా చౌక. అందుకే బస్సులకంటే ఎక్కువగా ప్రయాణికులు రైళ్ళను ఆశ్రయిస్తుంటారు. తాజాగా గుంటూరు – వికారాబాద్మధ్యన రాకపోకలు సాగించే పల్నాడు సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రజతోత్సవంలోకి అడుగుపెట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రయాణీకుల ఆదరాభిమా నాలు చూరగొన్న ఈ రైలు గత పాతికేళ్ల నుంచి నిర్విరామంగా సేవలందిస్తోండటం విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్లో వేకువజామున 5.15 గంటలకు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి రజతోత్సవ వేడుకని రైల్ఫ్యాన్స్ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందుకు రైల్వే శాఖ కూడా అనుమతించింది. రైలు లోకోమోటివ్ని డెకరేషన్, మామిడి తోరణాలు, ఫూలు, అరటి బొత్తలతో అలంకారం, ముందు మూడు, వెనక మూడు భోగీల డెకరేషన్, కేక్‌కటింగ్, కోచింగ్డిపో సిబ్బంది, అధికారులకు మెమెంటోల ప్రదానం, ఇంటర్మీడియట్ షెడ్యూల్డ్ హాల్ట్ స్టేషన్ల సిబ్బందికి షీల్డ్‌లను ప్రదానం చేశారు. అలాగే ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్చేశారు.
గతంలో ఈ రైలు గుంటూరు – సికింద్రాబాద్ మధ్యనే నడిచేది. 2006 వ సంవత్సరం ఆఖరులో అక్కడి ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు వికారాబాద్వరకు పొడిగించారు. ప్రతి రోజూ వేకుజామున 5.45కి గుంటూరు నుంచి బయలుదేరితే సత్తె నపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, విష్ణుపురం, మిర్యాలగూడ, నల్గొండ, చిట్యాల, నాగిరెడ్డిపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, సనత్‌నగర్, లింగంపల్లి, శంకర్పల్లి మీదుగా వికారాబాద్చేరుకొంటుంది. ఉదయం పూట సికింద్రాబాద్వెళ్లేందుకు, అటు నుంచి గుంటూరు వచ్చేందుకు మెజార్టీ ప్రయాణీకులు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణాన్నే కోరుకొంటారు. నాలుగేళ్ల క్రితం వరకు రాత్రి 8 గంటలకల్లా ఈ రైలు గుంటూరుకు చేరుకొనేది. ఎప్పుడైతే షెడ్యూల్సవరించారో అప్పటి నుంచి రాత్రి 9 తర్వాత వస్తోన్నది. వీలైతే పాత షెడ్యూల్‌నే పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరి రైల్వే శాఖ అధికారులు వీరి వినతిని మన్నిస్తారో లేదో చూడాలి.