కర్నాటకలో రాజకీయం వేడెక్కింది. కాంట్రాక్టర్ల నుంచి డీకే శివకుమార్ కమీషన్ డిమాండ్ చేశారంటూ మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన శివకుమార్ ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మాజీ సీఎం బసవరాజ్‌బొమ్మై, మాజీ మంత్రి అశోక్‌లు అందుకు సిద్ధమా? అంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్సవాల్ విసిరారు.ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు అన్నారు. కాంట్రాక్టర్లు ఎవరికి ఎంత ఇచ్చారననేది ప్రస్తావించేది లేదన్నారు. కానీ 10-15శాతం కమీషన్ ఎవరు అడిగారు, ఎవరు ఇచ్చారనేది ముఖ్యమన్నారు. సీఎం సిద్దరామయ్యఅడిగారా లేక మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారా అనేది ముఖ్యమన్నారు. నేను కమీషన్ కోరి ఉంటే ఈక్షణంలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. అశోక్ మాట్లాడింది చూశానన్నారు. దీనిని నిరూపించాలన్నారు.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer