HomeNewsకీలకశాఖలు సీఎం రేవంత్ వద్దే...మంత్రులకు శాఖలు కేటాయింపు

కీలకశాఖలు సీఎం రేవంత్ వద్దే…మంత్రులకు శాఖలు కేటాయింపు

Published on

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులుగా ఏడవతేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్‌ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్‌ వద్దే ఉంది.ఐటీ శాఖ ఎవరికి కేటాయిస్తారని తీవ్రమయిన చర్చ సాగింది. చివరకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి అయ్యారు. ఆయనకు పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల బాధ్యతలు కూడా అప్పగించారు.

మంత్రులు, వారి శాఖలు ఇవే..

రేవంత్‌ రెడ్డి.. హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య

మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ, విద్యుత్‌

దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: సివిల్‌ సప్లై, నీటి పారుదల,

సీతక్క: పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఉమెన్‌ వెల్ఫర్‌

శ్రీధర్‌బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

కొండా సురేఖ: అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ

పొంగులేటి శ్రీనివాస్‌: సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్‌

కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ

జూపల్లి: ఎక్సైజ్‌, పర్యాటక శాఖ, పురావస్తు

తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు

పొన్నం ప్రభాకర్‌: రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Latest articles

More like this