తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల పర్వం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఇవాళ మంచి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు తరలివస్తున్నారు. హైదరాబాద్ నామినేషన్ల హడావిడితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
దీంతో నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. ర్యాలీలు, రోడ్ షోలతో వాహనదారులు నరకయాతన అనుభవించారు.కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు, మియాపూర్ నుంచి లింగంపల్లి వరకూ ఫుల్ ట్రాఫిక్ జాం అయ్యింది. అలాగే జీడిమెట్ల నుంచి బాలనగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈరోజు మంచి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు.