HomeNewsNationalకర్నాటకలో సంక్షోభం.. సీఎం మార్పు ఉంటుందా?

కర్నాటకలో సంక్షోభం.. సీఎం మార్పు ఉంటుందా?

Published on

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందా? అసలేం జరుగుతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుండి హుటాహుటిన బెంగళూరు చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు రణదీప్ సూర్జేవాల, కేసీ వేణుగోపాల్ మంతనాలు జరుపుతున్నారు. గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి పదవి మార్పు పైన జోరందుకున్న ఊహాగానాలు. ఒకరికి ఒకరు చెక్ పెట్టుకున్నారు సిద్దరామయ్య, డీకే శివ కుమార్. ఇటీవల డీకే శివ కుమార్ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు ఇరవై మంది ఎమ్మెల్యేలతో మైసూరులో క్యాంప్ పెట్టడానికి ప్రయత్నించిన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ సతీష్ జార్కిహోలి. అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా క్యాంప్ వాయిదా పడింది. అయినా వెనక్కి తగ్గని సతీష్ త్వరలోనే క్యాంప్ పెట్టి తీరుతానని మంత్రి సతీష్ ప్రకటన చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకం విషయంలో ఎమ్మెల్యేలు వివిధ వర్గాలుగా చీలిపోయి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి వచ్చింది.

Latest articles

More like this