జనసేనతో పొత్తుతో బీజేపీ నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. కొన్ని సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో బీజేపీ ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొదటి జాబితాలో కొందరు అభ్యర్థులను మార్చాలని బీజేపీలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వరంగల్ వెస్ట్ సీటు రాకపోవడంతో రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. యాకత్‌పుర అభ్యర్థిని వీరేందర్ యాదవ్‌కు మార్చాలని స్థానిక బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అలాగే నర్సాపూర్ టికెట్‌ను మురళీయాదవ్‌కు కేటాయించటాన్ని గోపి వర్గం వ్యతిరేకిస్తోన్న పరిస్థితి. అటు కూకట్పల్లి సీటును జనసేనకు ఇవ్వొద్దని స్థానిక బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనకు టికెట్ల కేటాయింపులో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. ఇటు శేరిలింగంపల్లి సీటును జనసేన నేతలు కోరుతున్నారు. ఇక్కడ సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
జనసేన తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. చివరకు 9 సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ నుంచి సెటిలర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను కేటాయించాలని జనసేన భావిస్తోంది. మిగిలిన సీట్లను ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకునే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలి ఉంది.ఈ రాత్రికి తుది జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించిందని తెలుస్తోంది. .
బీజేపీ మూడో జాబితాలో ఆసిఫాబాద్ – తుకారాం
చెన్నూరు – అందుగుల శ్రీనివాస్
మంచిర్యాల – రఘనాధ బాబు
బాన్సువాడ – మాల్యాద్రి రెడ్డి
బోదన్ – మేడపాటి ప్రకాష్ రెడ్డి/ వడ్డి మోహన్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ – దినేష్
ఎల్లారెడ్డి – పైల కృష్ణా రెడ్డి
మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
పెద్దపల్లి. -గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి
వేముల వాడ – వికాస్ రావు / తుల ఉమ
జహీరాబాద్ – ఢిల్లీ వసంత్
సంగారెడ్డి – పులిమామిడి రాజు
నారాయణ ఖేడ్ – విజయపాల్ రెడ్డి
అందోల్ – బాబూమోహన్
హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి/జేఎస్ఆర్
సిద్దిపేట – దూది శ్రీకాంత్ రెడ్డి
షాద్ నగర్ – శ్రీవర్ధన్ రెడ్డి / అందె బాబయ్య
ఎల్ బి నగర్ – సామ రంగారెడ్డి
రాజేంద్ర నగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి – రవి కుమార్ యాదవ్
చేవెళ్ల – కెఎస్ రత్నం
వికారాబాద్ – తులసి విజయరామ్
కొడంగల్ – చీకోటి ప్రవీణ్
మేడ్చల్ – విక్రమ్ రెడ్డి/సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు మల్కాజ్ గిరి – ఆకుల రాజేందర్, ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ – పాపారావు/ బండారు విజయలక్ష్మి, మలక్ పేట – లింగాల హరిగౌడ్/ కొత్తకాపు రవీందర్ రెడ్డి, అంబర్ పేట – గౌతంరావు, జూబ్లీహిల్స్ – జాటూరి కీర్తిరెడ్డి, సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి, నాంపల్లి – విక్రమ్ గౌడ్, సికింద్రాబాద్ – బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్ – మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత, జడ్చర్ల – చిత్తరంజన్ దాస్, దేవరకద్ర – పవన్ కుమార్ రెడ్డి, అచ్చంపేట – సతీష్ మాదిగ, వనపర్తి – అశ్వత్థామ రెడ్డి, గద్వాల, నకరికల్ – పాల్వాయి రజని, నల్గొండ – శ్రీనివాసగౌడ్, మునుగోడు – బూర నర్సయ్య గౌడ్, దేవరకొండ – లాలూ నాయక్, మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్, మధిర – అజయ్ కుమార్, సత్తుపల్లి – శ్యామ్ నాయక్. ఈ రాత్రి లేదా రేపు బీజేపీ మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.