ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయదల్చుకోలేదు, నేను ఎన్నికలకు,పార్టీకి దూరంగా ఉండబోతున్నాను. పాత అధ్యక్షుడు… కొత్త అధ్యక్షులు.. ఇద్దరు నా ఫోన్ ఎత్తడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం బీజేపీ టికెట్ వేరే వాళ్లకు ఇస్తారంటూ ప్రచారంజరుగుతోంది. ఈ 2023 నవంబర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నా. ఎన్నికలకు, పార్టీకి, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటాను. పార్టీ అయినా నా కొడుకు అడిగితే ఇవ్వొచ్చు కానీ బీజేపీ పార్టీ లిస్ట్ ల పేరుతో దాపరికం నచ్చలేదని ఆయన అన్నారు.
అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీ కి కూడా రాజీనామా చేస్తా. సోషల్ మీడియా వచ్చాక.. ఇపుడు నాకు టికెట్ రాదు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నా కొడుకు కు టికెట్ ఇస్తున్నారు అంటూ ప్రచారాలు వచ్చాయి. నాకు నా కొడుకు ను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అనవసరమైన ఊహ గానాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆత్మభిమానాని దెబ్బతీస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అయన అన్నారు.బీజేపీ పెద్దలకు ఒకటే చెప్తున్నా మీరు అర్హులు అయినా వారికే టికెట్ ఇచ్చుకోండి. నాకు అవమానాలు చాలా జరిగాయి. ఇప్పటికైన నా మీద మీడియాలో తప్పుడు ప్రచారాలను ఆపండి. నా ఆత్మాభిమానం దెబ్బ తినడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నా. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో నా పేరు ప్రకటించకపోవడం వల్లే నా పై తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి. అందుకే ఈ నిర్ణయం అని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయరు. నన్ను కావాలనే దూరం పెట్టారని అయన విమర్శించారు.