HomeNewsకాంగ్రెస్ గూటికి వివేక్..? ఆ ఫ్యామిలీకి ట్రిపుల్ బొనాంజా

కాంగ్రెస్ గూటికి వివేక్..? ఆ ఫ్యామిలీకి ట్రిపుల్ బొనాంజా

Published on

తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ నడుస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇవ్వదు కాంగ్రెస్. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపు ఇస్తోంది. తాజాగా బీజేపీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి వచ్చి చేరుతున్నారు. మాజీ ఎంపీ వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. శనివారం ఉదయం బీజేపీ నేత వివేక్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో పార్టీలోకి వచ్చేందుకు వివేక్ సుముఖత వ్యక్తం చేశారు. వివేక్ కుమారుడు వంశీకి చెన్నూరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది.

వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ .. Courtesy Twitter

దీంతో వివేక్ పెద్దపల్లి ఎంపీ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే వివేక్ సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌కు బెల్లంపల్లి టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ పరిధిలోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్‌ గన్‌మెన్‌ కూడా లేకుండా ఒంటరిగా వచ్చారు. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్‌ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, వివేక్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరినట్లయింది. ఇటీవల బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఉన్న వివేక్ కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించడంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తెలంగాణ బీజేపీ ఈ పరిణామాలతో కుదేలయిందని అంటున్నారు.

గడ్డం వినోద్ ..

మరోవైపు 15 స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించలేదు. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించలేదు. నాలుగు స్థానాలను మాత్రం కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

Latest articles

More like this