నల్గొండ జిల్లాలో బిజెపికి భారీ షాక్ తగలనుందా? ఎన్నికల వేళ కమలం పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు కీలక నేత రెడీ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన తన స్వంత గూటికి చేరడానికి రంగం సిద్ధమయింది. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా బరిలోకి అధికార బిఆర్ఎస్ కు టెన్షన్ తెప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.. బిజెపిలో ఆయన ఉంటున్న గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.. పార్టీలో కీలకపదవి ఇచ్చినప్పటికీ అందులో ఇమడలేకపోతున్నారు.
దీంతో ఆయన చూపు కాంగ్రెస్ వైపు పడింది.. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎంపిగా ఉండటంతో పాటు పార్టీలోని సహచరులు కాంగ్రెస్ పార్టీలో చేరమని వత్తిడి తీసుకువస్తుండంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటి కానున్నారు..ఆయన సమక్షంలోనే తిరిగి స్వంతగూటికి చేరనున్నారు.. మునుగోడు నుంచి రాజగోపాల్ బరిలోకి దిగుతారని నల్లగొండ జిల్లాలో వినిపిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.