తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు 40 రోజులే ఉన్నాయి. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందున్నాయి. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వం అని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ కూడా సీట్లు పెంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ఎన్నికల సర్వేలతో పార్టీ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. ఇప్పుడు మరో సర్వే బయటకు వచ్చింది.ఇండియా టుడే-సీఓటర్ తమ సర్వేను రిలీజ్ చేసింది. ఈ సర్వేలో కూడా కాంగ్రెస్‌దే హవా అని తేలిపోయింది. ప్రస్తుతం ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో, ఎన్నికల్లో పెను సంచలనంగా మారింది. తాజా సర్వేను బట్టి చూస్తే బీఆర్ఎస్ షాకేనని చెప్పుకోవచ్చు.
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ఫలితాలు
కాంగ్రెస్ : 54 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి 39 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది.
బీఆర్ఎస్ : 49 సీట్లు సాధిస్తుందని,బీఆర్ఎస్ పార్టీకి 38 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది.
బీజేపీ : 08 సీట్లు సాధిస్తుంద సర్వే వెల్లడించింది.తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఫలితాలను ప్రభావితం చేయనుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. అంతేకాదు.. కేసీఆర్ పాలనా వైఫల్యాలను సైతం సీఓటర్ సర్వే నిశితంగా చర్చించి.. వివరించింది.