పవన్ కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భేటీ…
తెలంగాణలో జనసేన మద్దతు కోరిన బీజేపీ నేతలు…
32 స్థానాల్లో పోటీచేస్తామని గతంలో పవన్ ప్రకటన…
ఇప్పటికే ఏపీలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు..
గతంలో బీజేపీ గెలుపు కోసం కృషి చేశానన్న పవన్..
తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీచేయకపోతే..
జనసేనకార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న పవన్..
కలిసి పోటీ చేసే అంశంపై 2 రోజుల్లో రానున్న స్పష్టత
ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు తర్వాత బీజేపీతో సంబంధాల విషయంలో తీవ్ర చర్చ సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతును కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈరోజు జనసేన ముఖ్యనేతలు, కార్యకర్తలతో పవన్ భేటీ హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో భేటీ అయిన విషయం తెలిసిందే.. బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీతో పొత్తు అంశంలో తీసుకునే నిర్ణయంపై పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలంగాణలో జనసేన కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ-జనసేన కలిసి పోటీ విషయంలో అవగాహనకు వస్తాయా? అసలేం జరుగుతుంది అనేది హాట్ టాపిక్ అవుతోంది.