బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రే జాబితా ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా… ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్క్యాండిడేట్నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 40–50 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా ఇతర పార్టీల కంటే కూడా బీసీలు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముంనే చర్చ జరుగుతోంది.ఈ జాబితాకు సీఈసీ ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇందులో ఒకరిద్దరు మినహా రాష్ట్ర ముఖ్య నేతలందరి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో సభలు, సమావేశాలను కొనసాగిస్తూనే అభ్యర్థుల ఎంపికపైనా బీజపీ దృష్టి సారించింది .
40 నుంచి 50 మందికి అవకాశం?
అధికార బీఆర్ఎస్98 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్55 మందితో తొలిజాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదీగాక ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్నాయి. బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లో ఒకింత ఆందోళన ఉంది. అదీగాక మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో దిగాలు చెందుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతాయి కాబట్టి.. వెయిట్ అండ్ సీ పాలసీ పాటించాలని నేతలకు సూచిస్తోంది. అయితే తెలంగాణలో ప్రచారం జోరు పెంచాలని కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా… ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని అంటున్నారు.
మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక… వారే ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు. మేనిఫెస్టో ప్రకటనతోపాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, బీసీలకు తగిన గుర్తింపు, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిసింది.కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ ‘సకల జనుల ద్రోహి కేసీఆర్’ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్బన్సల్సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ఈటల రాజేందర్, పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్తపంథాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీల మేనిఫెస్టో, క్యాంపెయిన్, సోషల్ఔట్రీచ్, స్క్రీనింగ్తదితరాలు ఉన్నాయి. ఈ సమావేశాలతో పార్టీ కార్యాలయమంతా సందడి నెలకొంది. మేనిఫెస్టో, అభ్యర్థుల స్క్రీనింగ్, క్యాంపెయిన్, ఎన్నికల మేనేజ్మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు.
బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే…
అంబర్‌పేట – కిషన్ రెడ్డి
హుజురాబాద్ – ఈటల రాజేందర్
గద్వాల- డీకే అరుణ
దుబ్బాక-రఘునందన్ రావు
మునుగోడు-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కల్వకుర్తి-టి. ఆచారి
ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
జగిత్యాల-బోగ శ్రావణి
నిర్మల్- మహేశ్వర్ రెడ్డి
ధర్మపురి-వివేక్
అందోల్-బాబుమోహన్
మక్తల్-జలంధర్ రెడ్డి
సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
భూపాలపల్లి- చందుపట్ల కీర్తి రెడ్డి
మంథని-సునీల్ రెడ్డి
మానకొండూరు -ఆరెపల్లి మోహన్
వర్థన్నపేట- శ్రీధర్
మహబూబాబాద్ -హుస్సేన్ నాయక్
వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
జనగామ-దశమంత్ రెడ్డి
కరీంనగర్- బండి సంజయ్
ముషీరాబాద్ – బండారు విజయలక్ష్మి
సనత్‌నగర్-మర్రి శశిధర్ రెడ్డి
మల్కాజిగిరి – రాంచందర్‌రావు
ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
గోషామహల్ – విక్రమ్‌గౌడ్
మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
మహబూబ్‌నగర్- జితేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి
ఆలేరు – కాసం వెంకటేశ్వర్లు
వేములవాడ – చెన్నమనేని వికాస్‌రావు
ఆదిలాబాద్- పాయల్‌శంకర్
బోథ్- సోయం బాపూరావు
ఆర్మూర్ – ధర్మపురి అర్వింద్
పరకాల – గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్
సికింద్రాబాద్ – బండ కార్తీక రెడ్డి
వరంగల్ పశ్చిమ – ఏనుగుల రాకేశ్‌రెడ్డి
స్టేషన్ ఘన్పూర్- విజయరామారావు
రాజేంద్రనగర్- తోకల శ్రీనివాస్‌రెడ్డి
నల్గొండ-శ్రీనివాస్ గౌడ్
ఖానాపూర్-రమేష్ రాథోడ్ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.