HomeNewsగన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రేవంత్ అరెస్ట్

గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రేవంత్ అరెస్ట్

Published on

తెలంగాణలో ఒక వైపు రాజకీయాలు, ఎన్నికలు హాట్ హాట్ గా ఉన్నాయి. మంగళవారం ఉదయం గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.ఎలక్షన్ కోడ్ పేరుతో రేవంత్‌రెడ్డిని అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా? అని కేసీఆర్‌కి రేవంత్ సవాల్ విసిరారు.తన సవాలుకు సిద్ధమైతే అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని కేసీఆర్‌ని కోరారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వ్యాన్ ఎక్కి మరీ రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

డబ్బు పంచకుండా, చుక్క మందు పోయకుండా ప్రజలను ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కు లేదు.గురివింద నలుపు ఎరగదన్నట్టు… వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా డబ్బు, మందు పంచకుండా మ్యానిఫెస్టోతో ఓట్లడుగుదామంటే కేసీఆర్ తోకముడిచాడు. అమరుల స్థూపం దగ్గర ప్రమాణం చేసే దమ్ము కేసీఆర్ కు లేదు… దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నాడని తేలిపోయింది. తెలంగాణమా అప్రమత్తంగా ఉండు అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Latest articles

More like this