HomeNewsచంద్రబాబునాయుడికి సంఘీభావం నా బాధ్యత- మెట్రో ఈవెంట్లో గజ్జల యోగానంద్

చంద్రబాబునాయుడికి సంఘీభావం నా బాధ్యత- మెట్రో ఈవెంట్లో గజ్జల యోగానంద్

Published on

చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ,ఆయనకు మద్దతుగా మియాపూర్ నుండి నిర్వహించిన Lets Metro కార్యక్రమంలో బిజెపి శేరిలింగంపల్లి నాయకులు గజ్జల యోగానంద్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరం అని,కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కక్ష పూరితంగా చంద్రబాబుని అరెస్టు చేశారని ఆయన తెలిపారు.హైదరాబాదు నగర కీలక అభివృధిలో చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్ర పోషించారని, విజన్ 2020 లో భాగంగా ఎంతో అభివృధి చేసారని, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని BRS పార్టీ తామే చేశామని ప్రగర్భాలు పలకడం సరికాదన్నారు.

సుపరిపాలను రాజకీయాలకు అతీతంగా అభినందించాలని తెలిపారు. ఈ మెట్రో రైలులో చంద్రబాబు నాయుడు కి సంఘీభావం తెలపడం వ్యక్తిగతమని ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం నగర అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉందని తెలియజేయడమే తన ఉద్దేశమని యోగానంద్ తెలిపారు.

చంద్రబాబుకు న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ,ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

More like this